బ్రెడీ: ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ మధ్య బ్రెడీ వేదికగా ఇవాళ (ఆగస్టు 5) జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 10:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో 12:27 గంటల సమయంలో టాస్ కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఈ మ్యాచ్ ఐర్లాండ్ కొత్త ప్రధాన కోచ్ గ్యారీ విల్సన్‌కు తొలి మ్యాచ్ కావాల్సింది. 2025 మే తర్వాత ఐర్లాండ్ ఆడుతున్న తొలి 50 ఓవర్ల మ్యాచ్ కూడా ఇదే. వర్షం కారణంగా ఈ రెండు సందర్భాలు వాయిదా పడ్డాయి. జూన్‌లో భారత్‌పై 2-0తో టి-20 సిరీస్ విజయం తర్వాత ఐర్లాండ్ ఆడాల్సిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇదే.

కాగా, అఫ్గానిస్తాన్ జట్టు ఐదు వన్డేల సిరీస్ కోసం ఐర్లాండ్‌లో ఐర్లాండ్‌లో పర్యటిైస్తోంది. ఈ సిరీస్‌లోని మిగితా నాలుగు మ్యాచ్‌లు ఆగస్ట్ 7, 10, 12, 14 తేదీల్లో జరుగనున్నాయి. రెండో వన్డే బ్రెడీలో, ఆఖరి మూడు వన్డేలు బెల్‌ఫాస్ట్‌లో జరుగనున్నాయి.