హైదరాబాద్: హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసిలు బయటకు వచ్చాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి ఎన్ఒసిలు సృష్టించారు. ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు ఫైర్ ఎన్ ఓసిపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. ఇంటర్ బోర్డుకు ఎనిమిది కాలేజీలు సబ్మిట్ చేశాయి. ఎనిమిది కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాయి. మరో 60కాలేజీల ఎన్ ఒసిలను స్క్రూటినీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎనిమిది కాలేజీలు గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. వివిధ సెక్షన్ల కింద 337, 336(3), 340(2), 318(4) , ఆర్/డబ్లు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ ఆర్ నగర్, మెహదీపట్నం, బర్కత్ పురాలలో ఉన్న కాలేజీల యాజమాన్యం ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.