నవతెలంగాణ-ఉప్పల్​స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. అందులో భాగంగా తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్–పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా రామంతపూర్‌లోని జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. “స్టైఫండ్ పెంచాలి”, “వివక్ష వీడాలి”, “న్యాయం చేయాలి” అంటూ నినాదాలు చేశారు. […]

The post ‘ఆయుష్’లో నిరవధిక సమ్మె appeared first on Navatelangana.