ఖేర్సన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. తాజాగా ఖేర్సన్ నగరంలో ఓ కూరగాయల వ్యాపారిపై డ్రోన్ దాడి చేసింది. డ్రోన్ వ్యాపారిని వెంబడించి మరీ దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన భాయానక వీడియోని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ ఇందుకు సంబంధించిన భయానక వీడియోని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. అమాయక పౌరులపై రష్యా దళాలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని.. ఇది కచ్చితంగా యుద్ధ నేరమని పేర్కొన్నారు.

డ్రోన్ రావడాన్ని గమనించి యూరి (52) తన భార్యను సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించాడు. డ్రోన్ అతడిని వెంబడించడంతో భయంతో వ్యాన్ చుట్టు పరుగులు తీశాడు. అయితే చాలా సేపు యూరి చివరకు డ్రోన్ చేతికి చిక్కాడు. డ్రోన్ ఆ వాహననానికి ఢీకొట్టగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యూరికి తీవ్ర గాయాలయ్యాయి.