సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. 'ఛత్రపతి' ఫేం ప్రదీప్ రావత్(74) గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, బ్లడ్ క్లాట్ అవడంతో చికిత్స పొందుతూ ప్రదీప్ రావత్ మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

విలన్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రావత్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'సై', 'ఛత్రపతి' సినిమాతో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రదీప్ రావత్, దక్షిణాదిలో 70 సినిమాలకు పైగా నటించారు. ఇక, తెలుగులో ఆయన చివరిగా 'గాయపడ్డ సింహం' అనే సినిమాలో నటించారు.