దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాలకు బ్రేక్ పడింది. మెటల్, ఎనర్జీ, కన్స్యూమర్ షేర్లలో బలమైన కొనుగోళ్లు కనిపించడంతో మార్కెట్లు పాజిటివ్‌గా ముగిశాయి. అయితే ఆటో మరియు ఐటీ రంగాల షేర్లలో బలహీనత కారణంగా లాభాలు పరిమితమయ్యాయి.
నిఫ్టీ సూచీ 33.05 పాయింట్లు లేదా 0.14 శాతం పెరిగి 23,412.60 వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 49.74 పాయింట్లు లేదా 0.07 శాతం లాభపడి 74,608.98 వద్ద స్థిరపడింది.
మార్కెట్‌లో మెటల్, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో కొనుగోళ్లు ఉత్సాహాన్నిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, ముడి చమురు ధరల మార్పులు, విదేశీ పెట్టుబడిదారుల కదలికలు తదితర అంశాలు గురువారం మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.













