అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. తొలిసారిగా డాలర్ విలువ రూ.96 మార్క్‌ను దాటడంతో మార్కెట్లలో ఆందోళన నెలకొంది.
ముడి చమురు ధరల పెరుగుదల, బలమైన అమెరికా ఆర్థిక డేటా, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
ఆర్‌బీఐ జోక్యంతో కొంత స్థిరపడినా, ఈ ఏడాది రూపాయి ఇప్పటికే 6 శాతానికి పైగా నష్టపోయింది. రూపాయి బలహీనతతో పెట్రోల్, గ్యాస్, ఎలక్ట్రానిక్స్, బంగారం, విదేశీ విద్య ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఎగుమతిదారులకు మాత్రం ఇది కొంత లాభదాయకంగా మారనుంది.
















