బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఈ సర్జరీని ఆయన చాలా కాలంగా వాయిదా వేస్తూ వచ్చారని తెలుస్తోంది.

ఇటీవల దర్శకుడు అనీస్ బజ్మీ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా కేరళ షెడ్యూల్‌ను అక్షయ్ పూర్తి చేశారు. ఈ మూవీలో విద్యా బాలన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం. ఇది చిన్నపాటి ప్రక్రియ మాత్రమేనని, వైద్యుల సూచన మేరకు అక్షయ్ కుమార్ దాదాపు రెండు వారాల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఈ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో సమయం గడపాలని అక్షయ్ భావిస్తున్నట్లు సమాచారం.