టాలీవుడ్ స్టార్ జంట రష్మిక, విజయ్ మరోసారి సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రష్మిక చేసిన స్పెషల్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. పెళ్లి తర్వాత విజయ్‌తో జరుపుకున్న తొలి బర్త్‌డే కావడంతో ఈ పోస్టుకు మరింత ప్రాధాన్యం వచ్చింది.
“ఇది నా మనిషి పుట్టినరోజు” అంటూ రష్మిక ఎంతో ప్రేమగా రోజు మొత్తం ఎలా గడిచిందో అభిమానులతో పంచుకుంది. ఫ్రెండ్స్‌తో సెలబ్రేషన్స్, జిమ్ వర్కౌట్, ఫ్యాన్స్‌తో కలయిక… ఇలా రోజు మొత్తం ఎంతో ఆనందంగా గడిచిందని తెలిపింది. షూట్ క్యాన్సిల్ కావడంతో విజయ్‌తో పూర్తి రోజు గడపడం ఇంకా స్పెషల్‌గా అనిపించిందని చెప్పింది.
చివరగా “హ్యాపియెస్ట్ బర్త్‌డే మై వీజ్జూ...” అంటూ చేసిన మెసేజ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.













