అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలివుడ్ బ్యూటీ త్రిష మే 4న... 44వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో త్రిష ట్రెండ్ అవుతున్నారు. హైవేపై తిరుపతి సైన్ బోర్డు చూపిస్తూ త్రిష పెట్టిన ఇన్ స్టా స్టోరీ వైరల్ అవుతోంది. పుట్టిన రోజు కావటంతో తిరుపతి వెళుతున్నారని కొందరంటే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కి అనుకూలంగా పలితాలు రావాలని కోరుకునేందుకే ఆమె తిరుపతి వెళ్లారని కొందరు అభిమానులు చెప్పుకుంటున్నారు.