అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా 19వ మహాసభల సన్నాహకాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.

జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో 19వ ఆటా జాతీయ మహాసభలు, యువజన సదస్సు జరగనుంది. ఈ వేడుకలను

పురస్కరించుకుని హారిస్‌బర్గ్‌లో నిర్వహించిన ‘గ్రీట్ అండ్ మీట్’, ‘కన్వెన్షన్ కిక్ఆఫ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక తెలుగు కమ్యూనిటీ నుంచి సుమారు 100 మందికి పైగా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు.

ఈ సందర్భంగా బాల్టిమోర్ కన్వెన్షన్ గురించి నిర్వాహకులు వివరించారు. హారిస్‌బర్గ్ తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో ఈ మహాసభలకు హాజరై గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు.