మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) కమ్యూనిటీ సర్వీసెస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన Adopt-A-Park / Adopt-A-Road కార్యక్రమం ఆల్బనీ, న్యూయార్క్‌లో ఘనవిజయం సాధించింది.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత అనే లక్ష్యాలతో అనేక మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ కళ్యాణి బెల్లంకొండ నాయకత్వంలో ఈ కార్యక్రమం అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తోంది.
ఈ సందర్భంగా కళ్యాణి బెల్లంకొండ మాట్లాడుతూ, “ఈ ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా, అర్థవంతంగా ఉంది. సమాజంలో నిజమైన మార్పు తీసుకురావడం మా లక్ష్యం” అని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు శ్రీనివాస్ అరవపల్లి మరియు ఆల్బనీ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని చాప్టర్లకు ఈ కార్యక్రమాన్ని విస్తరించి, పరిశుభ్రమైన మరియు పచ్చదనంతో నిండిన సమాజాన్ని నిర్మించేందుకు MATA కృషి చేస్తోందన్నారు.























