ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు సరి కొత్త మాయా జాలం ఆందోళన కలిగిస్తుంది. అసలు మనిషే లేని కేవలం ఏఐ సృష్టించిన ఫోటోలను చూసేందుకు యువత నెలకు 390 వరకు చెల్లిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలగా పూర్తిగా AIతో సృష్టించిన ఇన్‌ఫ్లూయెన్సర్లు కనిపిస్తున్నారు. ఈ అకౌంట్లలో పోస్ట్ చేసే ఫోటోలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే యువత ఆసక్తిగా చూస్తున్నారు. కొన్ని అకౌంట్లు సబ్‌స్క్రిప్షన్ పెట్టి, ప్రత్యేక కంటెంట్ కోసం నెలకు 300 నుంచి 400 రూపాయల వరకు తీసుకుంటున్నాయి.

ఇలా ఒక AI ఇన్‌ఫ్లూయెన్సర్ అక్కౌంట్ నెలకు లక్షా 20 వేల వరకు సంపాదిస్తోంది. ఏఐ బొమ్మల హాప్ న్యూడ్ పోటోలు చూసేందుకు యువత ఎగబడుతున్నారంటే... వాళ్లు ఎంత కరువులో ఉన్నారో అర్థమవుతుందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

అయితే, అందరూ ఇలా చేస్తున్నారు అనుకోవడం తప్పు. ఇది ఒక కొత్త డిజిటల్ ట్రెండ్ మాత్రమే. అందుకే ఏదైనా సబ్‌స్క్రిప్షన్ తీసుకునే ముందు, అది నిజంగా అవసరమా లేదా అనే విషయాన్ని ఆలోచించడం చాలా ముఖ్యం.