అమెరికా-చైనా శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రపంచ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కీలక భేటీకి బీజింగ్ బయలుదేరుతున్నారు. అయితే పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి దాదాపు మూసుకుపోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.

ఇరాన్ యుద్ధం, గ్లోబల్ టారిఫ్‌లు, వాణిజ్య యుద్ధాలు అమెరికా ప్రతిష్టను దెబ్బతీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, 120 దేశాలతో వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంచుకున్న చైనా.. ట్రిలియన్ డాలర్ల ట్రేడ్ సర్ప్లస్‌తో మరింత బలపడుతోంది.

తైవాన్ అంశంపై అమెరికా చైనాను ప్రశ్నించే నైతిక స్థితి కూడా ఇప్పుడు బలహీనపడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్-షీ భేటీ... ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలను మార్చే కీలక సమావేశంగా మారింది.