ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ కుటుంబ జీవితంపై కొత్త వివాదం చెలరేగింది. ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్లోరియన్ టార్డిఫ్ తన తాజా పుస్తకం An (Almost) Perfect Coupleలో సంచలన ఆరోపణలు చేశారు.

వియత్నాం హనోయ్ పర్యటన సమయంలో విమానంలో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ను ఆయన భార్య బ్రిగిట్టే మాక్రాన్ చెంపదెబ్బ కొట్టినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. ఈ ఘటనకు ముందు మాక్రాన్ ఫోన్‌లో ఇరానియన్-ఫ్రెంచ్ నటి గోల్షిఫ్తే ఫరాహానీతో ఉన్న సందేశాన్ని బ్రిజిట్ చూసినట్లు రచయిత టార్డిఫ్ ఆరోపిస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలను బ్రిజిట్ మాక్రాన్ మరియు గోల్షిఫ్తె ఫరహానీ ఇద్దరూ పూర్తిగా ఖండించారు. బ్రిజిట్ ప్రతినిధులు ఈ కథనాన్ని “తప్పుడు”గా పేర్కొన్నారు. ఫరహానీ కూడా మాక్రాన్‌తో ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదని స్పష్టం చేశారు.