అమెరికాతో రెండో రౌండ్ శాంతి చర్చలకు వెళ్లేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం అతిత్వరలో ఇస్లామాబాద్ వేదికగా 2 దేశాలు మరోసారి చర్చలు జరపాల్సి ఉంది. కానీ అమెరికా సీజ్‌ఫైర్ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో తాము చర్చలకు రాబోమని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు.
అమెరికాతో చర్చల్లేవ్.. పాకిస్తాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా రెండో దశ చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ కొట్టిపారేసింది.
మిడిల్ ఈస్ట్ లో అమలవుతున్న కాల్పుల విరమణ ఏప్రిల్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ట్రంప్ తన చర్చల బృందాన్ని పాకిస్తాన్‌కు పంపాలని ఆదేశించారు. అయితే ఇరాన్ మాత్రం రెండో రౌండ్ చర్చల్లో పాల్గొనే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేసింది. దీంతో మరోసారి యుద్ధం తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. దీని ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడనుంది.



