చేతికి సంకెళ్లు ఉన్నాయి.. చుట్టూ పోలీసుల పహారా ఉంది.. అయినా సరే ఆ కిలాడీ ఖైదీ ఉన్నట్లుండి మాయమైపోయింది.. హాస్పిటల్‌లో వైద్య పరీక్షల కోసం వచ్చి, పోలీసుల కళ్లుగప్పి పరారైన ఖైదీ త్రివేణి ఉదంతం సంచలనంగా మారింది. ఆసుపత్రి నుంచి విజయవాడకు.. అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు.. ఇలా తప్పించుక తిరిగిన లేడీ ఖైదీకి పోలీసులు చెక్ పెట్టారు.