దేశవ్యాప్తంగా ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ ఊరటనిచ్చింది. రికార్డు స్థాయిలో రూ.32,600 కోట్లకు పైగా విలువైన ఆస్తులను తిరిగి అప్పగిస్తూ చరిత్ర సృష్టించింది. మనీలాండరింగ్ కేసుల్లో జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు, పెట్టుబడిదారులకు వేగంగా బదిలీ చేస్తూ నమ్మకం పెంచుతోంది.