KL Rahul Nitish Rana Partnership Record: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, నితీష్ రాణా విధ్వంసం సృష్టించారు. పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఈ జోడీ అజేయంగా 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించింది. రాహుల్ విశ్వరూపం ప్రదర్శించి 152 పరుగులు చేయగా, రాణా మెరుపు ఇన్నింగ్స్‌తో రికార్డుల వేటను కొనసాగించారు.