భారతీయ వివాహాలు ఎప్పుడూ కొత్త రకమైన ట్రెండ్స్‌కు వేదికవుతుంటాయి. ఇటీవల పెళ్లిళ్లలో ప్రయాణికులకు, అతిథులకు ప్రత్యేకంగా నిలిచేలా క్లిక్ బడ్డీ అనే కొత్త కాన్సెప్ట్ ప్రాచుర్యం పొందుతోంది. పెళ్లికి వచ్చిన అతిథులు తమ సొంత ఫోన్లలో మంచి ఫోటోలు దిగాలని కోరుకుంటారు. కానీ, ప్రతిసారీ ఇతరులను అడగడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి పెళ్లివారు ప్రత్యేకంగా ఒక క్లిక్ బడ్డీని నియమిస్తున్నారు.