కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ కుమార్ లాహిరిని నీతి ఆయోగ్ తదుపరి వైస్-ఛైర్మన్‌గా నియమించారు. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్-ఛైర్మన్ సుమన్ బేరి స్థానంలో లాహిరి బాధ్యతలు స్వీకరిస్తారు. సుమన్ బేరి మే 2022లో ఈ పదవిని చేపట్టారు. కేబినెట్ మంత్రితో సమానమైన హోదాను కలిగి ఉన్నారు.