ఐపీఎల్‌ 2026లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఆర్‌ఆర్‌ తరఫున 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవన్షీ కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున అభిషేక్‌ శర్మ (57), ఇషాన్‌ కిషాన్‌ (74) మెరుపు హాఫ్‌ సెంచరీలతో జట్టును గెలిపించారు.