టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా ఇతర పార్టీల మద్దతు కూడబెట్టుకుంటుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ఒక లేఖ విడుదల చేసింది. మతవాద శక్తులతో కలవనంత వరకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. అన్ని ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందని కాంగ్రెస్ పేర్కొంది.