Telugu Astrology: శుక్ర, చంద్రుల యుతితో వారికి కనక వర్షం..! కెరీర్లో గోల్డెన్ టైమ్
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు5 చూపులు

Venus-Moon Conjunction in Taurus: ఈ నెల(ఏప్రిల్) 19, 20, 21 తేదీల్లో వృషభ రాశిలో శుక్ర చంద్రుల యుతి జరుగుతోంది. ఇందులో చంద్రుడికి వృషభ రాశి ఉచ్ఛ రాశి కాగా, శుక్రుడికి స్వక్షేత్రం. సుఖ సంతోషాలకు, విలాసాలకు, శృంగార జీవితానికి, ప్రేమలకు, పెళ్లిళ్లకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మనస్సుకు కారకుడైన చంద్రుడితో పరివర్తన చెందడం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి మనసులోని కోరికలు తీరే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందడం, కెరీర్ పరంగా అనుకూలతలు పెరగడం, ప్రేమల్లో విజయాలు సాధించడం, వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడం వంటివి జరుగుతాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి
















