ఉత్తర తెలంగాణ రైతాంగం దశాబ్దాల కల అయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. ఈ ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.