మధ్యప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భూకొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భోపాల్ సమీపంలోని గురాడి ఘాట్ గ్రామంలో దాదాపు 5 ఎకరాల వ్యవసాయ భూమిని 2022 ఏప్రిల్‌లో సుమారు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒకే రోజున కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. అప్పట్లో ఆ భూమి విలువ రూ.5.5 కోట్లు ఉండగా..
రెండేళ్లలోనే రూ.3,200 కోట్ల బైపాస్ ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించడం, భూమి వినియోగ మార్పులు జరగడంతో ఆ స్థలం విలువ రూ.60 కోట్లకు పైగా పెరిగినట్లు సమాచారం. ఈ వివరాలు అధికారుల ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిటర్న్స్ (IPR) ద్వారా వెలుగులోకి వచ్చినట్లు నివేదిక పేర్కొంది.












