భారతీయ ఐటీ సర్వీస్ సంస్థలు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో 3.0–3.5% వరకు ఆదాయం తగ్గుదలను ఎదుర్కొనే అవకాశముందని Kotak Institutional Equities అంచనా వేసింది. ముందుగా అంచనా వేసిన 2.0–3.0% తగ్గుదల కంటే ఇది ఎక్కువ. సంస్థలు వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ టూల్స్‌ను స్వీకరిస్తుండటం దీనికి ప్రధాన కారణం.
అయితే, దీర్ఘకాలంలో ఇండియన్ ఐటీ రంగం ప్రాధాన్యత కొనసాగుతుందని బ్రోకరేజ్ అభిప్రాయపడింది. కానీ సమీప కాలంలో మాత్రం ఈ రంగం నెమ్మదైన వృద్ధి, మార్జిన్ ఒత్తిడితో కొనసాగనుంది. FY2027 వరకు గణనీయమైన పునరుద్ధరణ కనిపించే అవకాశం లేదని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, కొత్త పెట్టుబడులు ప్రధానంగా GPU ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫౌండేషన్ మోడల్స్, AI సాఫ్ట్‌వేర్ వైపే మళ్లుతున్నాయి. దీని వల్ల సంప్రదాయ ఐటీ సేవలకు కేటాయించే బడ్జెట్ తగ్గి, భారతీయ ఐటీ కంపెనీలకు అవకాశాలు క్షీణిస్తున్నాయి.











