కొత్త విద్యా సంవత్సరానికి ముందు విద్యార్థుల్లో పునర్వినియోగ సంస్కృతిని పెంపొందించేందుకు కేరళలోని కోజికోడ్ జిల్లా సుచిత్వ మిషన్, జిల్లా పరిపాలనతో కలిసి “రీయూజ్ హీరోస్: ది రియల్ హీరోస్” పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పాత వస్తువులను మళ్లీ ఉపయోగించే అలవాటును ప్రోత్సహించడం, సహజ వనరుల వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త బ్యాగులు, షూస్, యూనిఫాంలు వాడటమే గౌరవం అనే భావనను మార్చి… పాత వస్తువులను మళ్లీ ఉపయోగించే పిల్లలను గుర్తించి ప్రోత్సహించనున్నారు.
రీయూజ్ చేసిన వస్తువులతో స్కూల్‌కు వచ్చే విద్యార్థులకు “ఏ పాజిటివ్” సర్టిఫికేట్, భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో భాగమవుతామని చెప్పే వారికి “బీ పాజిటివ్” సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో అందించనున్నారు.
అత్యధికంగా పాల్గొనే పాఠశాలలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ఉపాధ్యాయులు, విద్యార్థులకు జిల్లా స్థాయి ప్రత్యేక అవార్డులు కూడా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు Suchitwa Mission Kozhikode Portal లో నమోదు చేసుకోవచ్చు.














