తమిళనాడు ప్రభుత్వం కొత్త మంత్రివర్గ శాఖలను అధికారికంగా కేటాయించింది. ముఖ్యమంత్రి విజయ్ కీలకమైన హోం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మహిళా-శిశు సంక్షేమం, యువజన సంక్షేమం, ప్రత్యేక కార్యక్రమాల అమలు వంటి శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.

ఇక మిగతా మంత్రులకు ఆర్థిక, ఆరోగ్య, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలు కేటాయించారు. ప్రభుత్వ పరిపాలనపై నేరుగా పట్టు సాధించేందుకు విజయ్ కీలక శాఖలను తన ఆధీనంలో ఉంచుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.