తమిళనాడులో విజయ్ పార్టీకి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. మరోవైపు విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

ఇప్పటివరకు డీఎంకే పార్టీతో కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధాన్ని పునఃసమీక్షిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తన ఐదుమంది ఎమ్మెల్యేల మద్దతును టీవీకే కు ప్రకటించింది.