పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్యకు గురయ్యారు. నార్త్ 24 పరగణాల జిల్లా మధ్యామ్ గ్రామ్ లో కారులో వెళ్తుండగా చంద్రనాథ్ పై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. బైక్ పైన వచ్చి, ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు చంద్రనాథ్. ఈ సంఘటనలో బుద్ధదేవ్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే పశ్చిమ బెంగాల్ లో ఈ ఘటన చోటు చేసుకోవటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

తాజా ఎన్నికల్లో భవానిపూర్ నుంచి మమతా బెనర్జీ పైన సువేందు అధికారి విజయం సాధించాడు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో కూడా సువేందు అధికారి ఉన్న తరుణంలో ఈ హత్య జరగడం రాజకీయ కుట్ర అని అనుమానాలకు తావిస్తోంది.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.













