మేష రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యవహారాలు విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొనేవారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మీ వ్యవహార శైలికి విరుద్ధంగా ఏ పని చేయరు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృషభ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. విద్యార్థిని విద్యార్థులకు మీరు కోరుకున్న కళాశాలలో సీటు లభిస్తుంది. మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం తక్కువగా కనిపిస్తున్న భావన ప్రతి పనిలో ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఈ రాశి వారు ప్రతి సోమవారం ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధున రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తెరాసరి వివాదాలు కొలిక్కి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. రుద్ర పాశుపత హోమం చేయించండి. మీ రాశి వారి ప్రతిరోజు కూడా కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. రాశి వారికి కలిసివచ్చేసిన నాలుగు కలిసివచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో ఏర్పడిన సమస్యలను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవి లభిస్తుంది. విరాష్వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. కుబేర కుంకుమతో మొగలి పువ్వు కుంకుమతో మంగళవారం శుక్రవారం అమ్మవారికి పూజ చేయండి. సప్తమకి రుద్రాక్ష మెడలో ధరించండి. మీ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

సింహ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పాశుపత హోమం చేయించండి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు మీరు కోరుకున్న కళాశాలలో సీటు లభిస్తుంది. రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చేసరికి 6 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దూకాలంగా పెండింగ్లో ఉన్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తవుతాయి. ఎంతోకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రాజు వారు ప్రతి రోజు ప్రతినిత్యం జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి చాలా మంచిది. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్.

తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరంగా మాత్రం దేనికి లోటు ఉండదు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. రాజకీయరంగంలో ఉన్న వారికి నూతన పదవులు లభిస్తాయి. చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి,ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. దగ్గర బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

తులా రాశి వారికి ఈ వారం చాలావరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వ్యాపారంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రం చదవండి. హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.


ధనస్సు రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. దైవచింతన ఎక్కువగా ఉంటుంది. దైవదర్శనాలు కూడా ఎక్కువగా చేసుకుంటారు. సంతాన విద్యా విషయాలు కాస్త నిరాశపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎంతోకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కాంట్రాక్టులు లీజులు లాభ స్థాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మంగళవారం మరియు శనివారం రోజున సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయండి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మెరిట్ మార్కులు సాధిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మకర రాశి వారికి వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలుస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ పరంగా మార్పులు చేర్పులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారు బుధవారం రోజున అరటినార వత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం రోజున కుబేర కుంకుమతో మొగలి పువ్వు కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరంగా అభివృద్ధి సాధిస్తారు. సంతానం పరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఉండవు. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. దగ్గర బంధువులతో భూసంబంధమైన విషయాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్త వింటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రావలసిన బెనిఫిట్స్ రాకపోగా నష్టం వాటిల్లి అవకాశం ఉంది. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి అలాగే శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. మీ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ చాలావరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ నలుగురిలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున అఘోర పాశుపత హోమం చేయించండి 8 శనివారాలు శనివకి తైలాభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.