
బెంగళూరు: నగ్నంగా పూజ చేయడానికి న్యూడ్ ఫొటోలు పంపించాలని యువతిని ఓ వ్యక్తి వేధించిన సంఘటన కర్నాటక బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... రామనగర తాలూకాలో కిరణ్ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఓ యువతికి ఫోన్ చేసిన నగ్నంగా కూర్చొని పూజలు చేస్తే రూ.30 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. ఒంటిపై పుట్టుమచ్చలు ఉంటే పూజకు పనికిరావని, నగ్నంగా ఫొటోలు దిగి పంపించాలని పలుమార్లు యువతిని వేధించాడు. జరిగిన విషయం యువతి తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












