
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్ నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఆయనను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రోహిత్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపడంతో.. మే 3న బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. రోహిత్ జైన్ ప్రస్తుతం ఆర్‌బిఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన దాదాపు మూడు దశాబ్దాలుగా కేంద్ర బ్యాంకులో వివిధ హోదాలలో పనిచేశారు.
కాగా, ఇటీవల పొడిగించిన పదవీకాలం ముగిసిన టి.రబీ శంకర్ స్థానంలో జైన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రబీ శంకర్ మొదట 2021లో నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం ముగియడంతో.. 2024, 2025లో కేంద్రం రెండుసార్లు పొడిగించింది.













