హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా సదాశివ పేట మండలం నందికంది దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తుండగా ఆటో డివైడర్ ను ఢీకొంది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు లావణ్య(39), రుక్మిణి(42) గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణం ఆటో డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.