
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా ఏడు మ్యాచులు ఆడితే రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించి.. గెలుపు ఖాతా తెరిచింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు లక్నో వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం లక్నోకి కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సిద్ధార్త్ స్థానంలో లిండే జట్టులోకి వచ్చాడు. కోల్‌కతా గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తోంది.
తుది జట్లు:
ఎల్‌ఎస్‌జి: ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, ముకుల్ చౌదరీ, జార్జ్ లిండే, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, మోసిన్ ఖాన్.
కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(కీపర్), కామరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రోమ్‌మెన్ పోవెల్, రింకూ సింగ్, సునీల్ సరైన్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ.














