
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టేబుల్ టాపర్లు పంజాబ్ కింగ్స్‌ని ఓడించి మంచి జోష్‌లో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఆశపడుతోంది. మరోవైపు వరుసగా ఓటముల పాలవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఈ మ్యాచ్‌లో విజయం కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. ఢిల్లీ మూడు మార్పులు చేసింది.
తుది జట్లు:
ఆర్ఆర్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డొనొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్, బ్రిజేశ్ శర్మ.
డిసి: కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, కైలీ జెమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.












