
హైదరాబాద్: మంత్రి అజారుద్దీన్, సీనియర్ నేత కోదండరామ్‌లకు పెద్ద ఊరట లభించింది. వీరిద్దరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. వీరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఫైల్‌పై గవర్నర్ సంతకం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గత మూడు సంవత్సరాలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవికి గండం ఏర్పడింది. ఈ నెల 30 లోగా ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే.. అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు గవర్నర్ సంతకం చేయడంతో అతడికి ఊరట లభించింది.













