
అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధం కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో చాబహార్ పోర్టు సమీపంలో నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు, సముద్ర నిఘా సంస్థల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్‌కు వెలుపల గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో ఉన్న చాబహార్ పోర్టు అమెరికా దిగ్బంధ రేఖకు సమీపంలో ఉండటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత వారం చివర్లో అక్కడ ఆరు నుంచి ఎనిమిది వరకు భారీ సూపర్ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అమెరికాకు చెందిన అణు వ్యతిరేక సంస్థ, యునైటెడ్‌అగైనెస్ట్‌అణు ఇరాన్, సముద్ర గూఢచారి సంస్థ విండ్‌వార్డ్‌తెలిపాయి. వీటితో పాటు మరికొన్ని చిన్న ట్యాంకర్లు కూడా సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో గత వారం అమెరికా నౌకాదళం అడ్డుకున్న రెండు భారీ చమురు నౌకలను మళ్లించినట్లు కూడా అమెరికా నేవీ వెల్లడించింది.
చమురు మార్కెట్ విశ్లేషణ సంస్థ వోర్‌టెక్సా లిమిటెడ్ అంచనా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రవాణాలో లేదా సముద్రంలో నిల్వగా ఉన్న ఇరాన్ ముడి చమురు పరిమాణం సుమారు 15.5 కోట్ల బ్యారెల్స్‌గా ఉంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇరాన్ ఇంకా చమురును నౌకల్లో లోడ్ చేస్తూనే ఉన్నప్పటికీ, అమెరికా దిగ్బంధం కారణంగా ఆ చమురు కొనుగోలుదారుల వద్దకు చేరకుండా అడ్డుకట్ట పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపు శూన్య స్థాయికి పడిపోయినట్లు సమాచారం. ని ల్వ సామర్థ్యం తగ్గిపోతుండటంతో త్వరలోనే ఇరాన్ చ మురు ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అమెరికా ఒత్తిడి మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ చమురు ఎగుమతులు సంక్షోభా న్ని ఎదుర్కొంటున్నాయి.
ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక చర్యలు చేపడుతోంది. హిందూ మహాసముద్రంలో చమురు ట్యాంకర్లను తనిఖీ చేయడంతో పా టు, ఇరాన్ చమురు కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ చై నాకు చెందిన ఓ ప్రధాన రిఫైనరీపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది.ఇరాన్ వద్ద ఇంకా ఎన్ని ఖాళీ ట్యా ంకర్లు అందుబాటులో ఉన్నాయన్నది స్పష్టంగా తెలియకపోయినా, పాత నౌకలను మళ్లీ వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు నౌకా ట్రాకింగ్ సమాచారం సూచిస్తోంది.















