
ఇరాన్ నౌకల స్వాధీనంలో అమెరికన్ నేవీ పైరేట్స్ పాత్ర
పోషిస్తుంది నౌకలలోని చమురంతా అమెరికాకే ఇది
లాభసాటి వ్యాపారంలా ఉంది ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫ్లోరిడా: ఇరాన్ పోర్టుల దిగ్బంధానికి అమెరికా నౌకలు ఎంతకైనా తెగిస్తాయని ట్రంప్ తెలిపారు. అవును అవసరం అయితే తమ బలీయమైన యు ఎస్ నేవీ పైరెట్స్ పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో శుక్రవారం రాత్రి తరువాత ఆయన ఓ ర్యాలీలో ఉత్సాహంతో ప్రసంగించారు. ఇరాన్‌పై బ్లాకేడ్ సాగుతోంది. ఇరాన్ చమురుతో కూడిన నౌక లు, ట్యాంకరును అమెరికా నౌకాదళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.
ఈ పని చాలా ఘనంగా జరిగిందని చెప్పా రు. సముద్ర జలాల్లో ఆ నౌకలపైకి చేరుకున్నామని, వాటిని స్వాధీనం చే సుకున్నామని, అందులోని చమురును తీసుకున్నామని, ఇదంతా కూడా చాలా లాభసాటి వ్యాపారవ్యవహారం అన్పిస్తోందని ర్యాలీలో తెలిపారు. అమెరికా నౌకాదళాలు ఇప్పుడు ఏకంగా సముద్ర జలాల్లో సాయుధ దోపిడీలకు దిగుతున్నాయని ఇరాన్ మండిపడింది. ఇరాన్ ముడిచమురును తీసుకువస్తున్న రెండు ట్యాంకర్లను అమెరికా నౌకలు అటకాయించడంపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.









