హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగుతోంది. తమిళనాడు డిఎంకె పార్టీ హవా కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ టిఎంసి ముందంజలో ఉంది.  పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (123), బిజెపి (97), కాంగ్రెస్(05) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకె కూటమి (67), అన్నాడిఎంకె కూటమి(34), టివికె(22), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (63), యుడిఎఫ్(71), ఎన్డిఎ (5) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(60), కాంగ్రెస్ కూటమి(30), ఇతరులు(02), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(19), కాంగ్రెస్ కూటమి(09), ఇతరులు(02) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.