హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని, శంకర్ గౌడ్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరం అని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసి కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని, సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారని, బిఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్ ఎల్ ఎల జీతాల్లో కోత విధిస్తే ఎంత వస్తుంది? అని బండి ప్రశ్నించారు. ఆ డబ్బు బఠానీలు కొనుక్కోవడానికీ సరిపోవు అని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే కార్మికులకు ఇవ్వొచ్చునని సూచించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తెలంగాణ నుంచే డబ్బు సరఫరా అని ప్రధాని నరేంద్ర మోడీని అడిగి కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేశారా? అని ప్రశ్నించారు.