హైదరాబాద్: మినిస్టర్ క్వార్టర్స్ లో బిసి స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆలోచన మేరకు రాజీవ్ అభయ హస్తం తో సివిల్స్ రాస్తున్న వారికి ఆర్థిక సహకారమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి సరైన శిక్షణ పొంది అత్యధికంగా సివిల్స్ ర్యాంకులు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బిసి స్టడీ సర్కిల్ లో 100 మందికి పైగా సివిల్స్ ప్రిలిమినరీ మే 24 వ తేదీ పరీక్షలు రాసే వారి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు మోటివేషనల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగిందని వివరించారు. బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి బిసి స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ రూపొందించడం జరిగిందని, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఆత్మస్థైర్యం తో సాధించాలని లక్ష్యంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. బిసి స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ , గ్రూప్స్, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు లో ఉన్నత అధికారులుగా పొందే అవకాశాన్ని జారవిడవకుండా శ్రమపడాలని ఆకాంక్షిస్తున్నారు.