
పంజాబ్ అసెంబ్లీలో శుక్రవారం రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఏకగ్రీవంగా నెగ్గింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారధ్య ప్రభుత్వం ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆప్ ఎంపీల ఫిరాయింపుల దశలో ఈ బలపరీక్షకు దిగింది. బలపరీక్ష కోసం పంజాబ్ విధాన సభ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. పార్టీలో తామంతా విశ్వసనీయ సైనికుల మాదిరిగా ఉంటామని ఎమ్మెల్యేలు ప్రకటించారు. తమ ప్రభుత్వ బలపరీక్ష తీర్మానాన్ని ముఖ్యమంత్రి మాన్ స్వయంగా సభలో ప్రవేశపెట్టారు. ఆప్ కథ ముగిసినట్లే అని , ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లుతారని ప్రచారం జరిగిందని , దీనితో ప్రజలలో ఏదో జరుగనుందనే భ్రమలు ఏర్పాడ్డాయని మాన్ తీర్మానం ప్రవేశపెట్టే దశలో తెలిపారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టే దశలో సభలో విపక్షాలు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీంగా ఆమోదించింది. తామంతా కూడా కేజ్రీవాల్ వెంబడి నిలబడుతామని, తనకు మద్దతుగా ఎమ్మెల్యేలు ఉంటారని ఈ సందర్భంగా మాన్ తెలిపారు.














