
కర్నూల్: తన భార్యను కాపురానికి పంపాలని ఓ యువకుడు రేడియో స్టేషన్ టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. కర్నూలు జిల్లా అదోనీలో ఈ ఘటన జరిగింది. చిప్పగిరి మండలం నేమ్మకల్లు గ్రామానికి చెందిన సురేంద్ర కుటుంబ కలహాలతో టవర్ ఎక్కాడు. దీంతో స్థానికులు అక్కడ గుమ్మిగూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడితో ఫోన్‌లో మాట్లాడి నచ్చెజెప్పారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని క్షేమంగా కిందకు దింపారు.











