తెలంగాణ ప్రభుత్వం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG) కార్యకలాపాలకు నిరంతరంగా బడ్జెట్ విడుదల చేస్తోందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మరియు బీఎస్‌జీ రాష్ట్ర కార్యదర్శి డా. ఈ. నవీన్ నికోలస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌కు వివరాలు తెలియజేస్తూ, 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 1,000 పాఠశాలలు బీఎస్‌జీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యాయని చెప్పారు.
అలాగే 2026-27 విద్యా సంవత్సరంలో మరో 1,000 పాఠశాలలు ఈ కార్యక్రమాల్లో చేరే అవకాశం ఉందని వెల్లడించారు.













