
ఐపిఎల్ 2026లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్, రాజస్థాన్ జట్టుకు భారీ టార్టెట్ ను నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్నీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పయి 222 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభుసిమ్రాన్ సింగ్(59), ప్రియాన్ష్ ఆర్య(29), కాన్లీ(30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(30)లు రాణించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్ భారీ షాట్లతో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సులతో అజేయంగా 62 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్, రాజస్థాన్ జట్టు ముందు 223 పరుగుల టార్టెగ్ ను ఉంచింది.













