
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్‌కె 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని జిటి 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ 87 పరుగులతో రాణించాడు. బటర్ల్ (39 నాటౌట్), గిల్ (33) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో గుజరాత్ 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. చెన్నై ఒక స్థానం కోల్పోయి.. 6 స్థానానికి పడిపోయింది.
















