అహ్మదాబాద్: భార్యపై అనుమానంతో ఆమెను భర్త చంపి అనంతరం పూర్వీకుల ఇంట్లో చెక్కపెట్టేలో మృతదేహాన్ని సిమెంట్‌తో పూడ్చి పెట్టిన సంఘటన గుజరాత్‌లో సూరత్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సలబత్‌పూరాలో విశాల్ సాల్వి-శిల్ప అనే దంపతులు నివసిస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిల్ప ఎంఎస్ చేసి పూర్తి చేసి సూరత్ మున్సిపల్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ రిసెర్చ్ సెంటర్‌లో డైటీషియన్‌గా జాబ్ చేస్తోంది. సొంతంగా క్లీన్‌క్ కూడా నిర్వహిస్తోంది. గతంలో విశాల్ డైమండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. గత కొంత కాలంగా ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. గత కొంత కాలంలో భార్య మరొకరుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు.

పలుమార్లు ఫోన్‌లో కాల్స్ చెక్ చేయడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను భర్త చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆమెన తన పూర్వీకులు ఉండే ఇంటికి తీసుకెళ్లి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని చెక్క పెట్టెలో పెట్టి సిమెంట్ పూత పూశాడు. అనంతరం తన భార్య కనిపించడంలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన రెండు రోజుల తరువాత భర్త కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. చిన్న కుమారుడికి ఒక లేఖ కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో వెంటనే కుళ్లిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శిల్ప తండ్రి ప్రదీప్ కోస్టా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.