దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అక్రడిటేషన్ల జారీ

అక్రిడిటేషన్ల సంఖ్య తేలితే జర్నలిస్ట్‌లకు మరిన్ని సౌకర్యాల కల్పన

గతం కంటే ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో అక్రిడిటేషన్ల మంజూరు

మే 10 లోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అక్రిడిటేషన్లు

మే 1న అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ల పంపిణీకి కలెక్టర్లకు ఆదేశం

మే 31 వరకు అందరికీ బస్సు పాస్‌ల పొడిగింపు

రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు అక్రిడిటేషన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గురువారం సమాచార శాఖ ఆధ్వర్యాన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన అక్రి డిటేషన్ కార్డులను ఇంతవరకు పొడిగించామని, దేశంలో, ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇక్కడ అనుసరించాలన్న ఆలోచన మేరకు పరిశీలన సాగిందని అందువల్లే ఈ కార్డుల జారీలో ఆలస్యం చోటు చేసుకుందన్నారు. గత ప్రభుత్వం 32,500 మందికి అక్రి డిటేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా 23,352కే పరిమితం చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు సుమారు 46 వేల మందికి పైగా అక్రిడిటేషన్లు ఇచ్చేలా మార్పులు చేసిందని తెలిపారు. ఇప్పటికే సుమారు 2800 వరకు కార్డులను ఆమోదించడం జరిగిందని వివరించారు. జర్నలిస్టుల సూచ నల మేరకు జీవోలలో మార్పులు చేర్పులు చేశామని, అర్హులైన జర్నలిస్టులకు కార్డుల మంజూరులో వెనకడుగు ప్రసక్తే లేదన్నారు.

మే 1వ తేదీన అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ ప్రక్రియలో మే 10వ తేదీని ఒక కటాఫ్ డేట్‌గా పెట్టుకొని దరఖాస్తులు చేసుకోవాలని, ఆ తేదీ లోగా వచ్చే దరఖాస్తులను ఆమోదించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్లు సంఖ్య తేలితే జర్నలిస్టులకు ఆరోగ్యం ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రణాళిక రూపొందించు కోవచ్చునన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ దిశగా పలు సూచనలు చేశారని వెల్లడించారు. అంతేగాక జర్నలిస్టులు వివిధ సంస్థలలో ఉద్యోగాలు ఆమరినప్పటికీ అక్రిడిటేషన్ల మంజూరు ఓ నిరంతర ప్రక్రియగా సాగుతుందని ఈ విషయంలో ఎటువంటి సందేహాలు వద్దని అన్నా రు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని త్వరలో పాత్రికేయ సంఘాలతో భేటీ అవుతామని తెలి పారు. ఏప్రిల్ 30తో కొంతమంది జర్నలిస్టుల బస్సుపాస్‌ల గడువు ముగుస్తున్నందున మరో నెల రోజుల పాటు పొడిగించేలా చర్యలు తీసుకుంటా మని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను అందజేసి అభినందించారు. ఈ కార్య క్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.